శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 16:07:53

సుశాంత్ సోద‌రి ప్రియాంక సింగ్‌పై కేసు పెట్టిన రియా

సుశాంత్ సోద‌రి ప్రియాంక సింగ్‌పై కేసు పెట్టిన రియా

సుశాంత్ సింగ్ సోద‌రి ప్రియాంక సింగ్‌పై ముంబై పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదు చేసింది రియా. ఆరు పేజీల‌తో కూడిన ఫిర్యాదుని రియా పోలీసుల‌కు అంద‌జేయ‌గా, అందులో త‌న సోద‌రి ప్రిస్క్రిప్ష‌న్ లేకుండా చట్టవిరుద్ధంగా సైకోట్రోఫిక్ పదార్థాలను సూచించింద‌ని, అది వాడిన త‌ర్వాత ఐదు రోజుల‌కి సుశాంత్ మ‌ర‌ణించాడ‌ని పేర్కొంది. ప్రియాంక సింగ్, డాక్టర్ తరుణ్ కుమార్ పై ఐపిసి 1860, నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్ యాక్ట్, 1985 మరియు టెలిమెడిసిన్ ప్రాక్టీస్ గైడ్లైన్స్, 2020 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రియా తన ఫిర్యాదులో కోరారు.

ఇటీవ‌ల సుశాంత్ సోద‌రి ప్రియాంక చాట్ లీక్ కాగా, అందులో సుశాంత్ మాన‌సిక స్థితి, డిప్రెష‌న్ గురించి ఆమె సోద‌రికి ముందే తెలుసని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు మందుల‌ను కూడా వాడాల‌ని ప్రియాంక సూచించారు. లిబ్రియ‌మ్‌(క్లోర్డియాజిపోక్సైడ్‌)ను వారం రోజుల‌పాటు, ఆ త‌ర్వాత నెక్సిటోను ప్ర‌తిరోజూ ఉద‌యం అల్పాహారం తీసుకున్న త‌ర్వాత వాడాల‌ని సుశాంత్‌కు ఆమె సోద‌రి ప్రియాంక మెస్సేజ్ చేశారు. తీవ్ర ఆందోళ‌న‌గా అనిపించిన‌ప్పుడు లొనాజెప్‌ను వేసుకోమ‌ని తెలిపారు. 

డాక్ట‌ర్ ప్రిస్క్రిప్ష‌న్ లేకుండా మందులు ఇవ్వ‌రు క‌దా అని సుశాంత్ అనుమానం వ్య‌క్తం చేయ‌గా, తాను ఎలాగోలా మేనేజ్ చేసి తెస్తాన‌ని చెప్పింది ప్రియాంక‌. త‌న మిత్రురాలు డాక్ట‌ర్ అని, ఆమె స‌హాయంతో ముంబైలోని మంచి వైద్యున్ని క‌లిసి చికిత్స కోరుదామ‌ని తెలిపారు. అనంత‌రం మందుల ప్రిస్కిప్ష‌న్ షేర్ చేసిన ఆమె, ఇందులో ఉన్న మూడు ఔష‌ధాలు మాన‌సిక‌ ఒత్తిడి, ఆందోళ‌న‌కు వాడేవే కాగా లిబ్రియ‌మ్‌ను డ్ర‌గ్స్ నివార‌ణ‌కు కూడా వినియోగిస్తారు. కాగా సుశాంత్ కుటుంబ స‌భ్యులు అడిగితేనే ఆయ‌న వాడాల్సిన ఔష‌ధాలు రాసిచ్చాన‌ని ఢిల్లీలోని రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆస్ప‌త్రి వైద్యుడు డా. త‌రుణ్ కుమార్ వెల్ల‌డించారు. ఈ విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని రియా.. ప్రియాంక‌పై కేసు పెట్టింది.