శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 06, 2020 , 13:54:15

డ్ర‌గ్స్ కేసు.. రియా క‌స్ట‌డీ పొడిగింపు

డ్ర‌గ్స్ కేసు.. రియా క‌స్ట‌డీ పొడిగింపు

హైద‌రాబాద్‌:  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో సంబంధం ఉన్న డ్ర‌గ్స్ కేసులో రియా చ‌క్ర‌వ‌ర్తి, ఆమె సోద‌రుడు శౌవిక్ చ‌క్ర‌వ‌ర్తిలు ప్ర‌స్తుతం జైలులో ఉన్న విష‌యం తెలిసిందే. దాదాపు నెల రోజుల నుంచి ఆ ఇద్ద‌రూ జైలుకే ప‌రిమితం అయ్యారు. అయితే రియా, శౌవిక్‌లు ఈనెల 20 వ‌ర‌కు జైలులోనే ఉంటార‌ని ఇవాళ ముంబైలోని ప్ర‌త్యేక కోర్టు వెల్ల‌డించింది. జ్యూడిషియ‌ల్ క‌స్ట‌డీని పెంచుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  హీరో సుశాంత్‌తో డేటింగ్ చేసిన రియాను సెప్టెంబ‌ర్ 9వ తేదీన ఎన్సీబీ అదుపులోకి తీసుకున్న‌ది.  సుశాంత్‌కు మాద‌క‌ద్ర‌వ్యాలు చేర‌వేసినట్లు ఆమె అంగీక‌రించింది.  తానేమీ డ్ర‌గ్స్ వాడ‌లేద‌ని, కానీ సుశాంత్‌కు తెచ్చి ఇచ్చేదాన్ని అని రియా ఎన్సీబీతో చెప్పింది.  జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రా ఇంట్లో సుశాంత్ అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందిన విష‌యం తెలిసిందే. 

డ్ర‌గ్స్ మ‌రొక‌రికి తెచ్చి ఇవ్వ‌డం చాలా తీవ్ర‌మైన నేర‌మ‌ని, డ్ర‌గ్స్ ఫండింగ్ చేస్తున్న కేసుతో ఈ అంశం లింకు అయి ఉంటుంద‌ని ఎన్సీబీ అధికారులు తెలిపారు. డ్ర‌గ్స్ సిండికేట్‌లో రియా యాక్టివ్‌గా ఉన్న‌ట్లు నిర్ధారించారు.  సుశాంత్ కేసును  సీబీఐకి అప్ప‌గించిన త‌ర్వాత రియా అస‌లు స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింది.  నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆమె వాట్సాప్ చాటింగ్ డిటేల్స్ ద్వారా డ్ర‌గ్స్ మాఫియా కోణాన్ని వెలుగులోకి తెచ్చారు.  


logo