బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 06, 2020 , 19:08:48

సుశాంత్ ఫోన్ నంబ‌ర్ బ్లాక్ లో పెట్టిన రియా..!

సుశాంత్ ఫోన్ నంబ‌ర్ బ్లాక్ లో పెట్టిన రియా..!

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆక‌స్మిక మృతి కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో మ‌రో ట్విస్ట్ అనేక అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. సుశాంత్ ఫోన్ నంబ‌ర్ ను అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తి జూన్ 8న బ్లాక్ లో పెట్టింద‌ట‌. సుశాంత్ జూన్ 14న చ‌నిపోగా..జూన్ 8 -14వ తేదీ వ‌ర‌కు సుశాంత్, రియా మ‌ధ్య ఎలాంటి కాంటాక్ట్ లేన‌ట్టు తేలింద‌ని ఓ జాతీయ మీడియా తన క‌థనంలో పేర్కొంది. సుశాంత్ కేసును సీబీఐతో ద‌ర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపిన విష‌జ్ఞం తెలిసిందే. ఈ మేర‌కు  బుధ‌వారం డీవోపీటీ నుంచి సీబీఐకి నోటిఫికేష‌న్ అందింది. 

ఇదిలా ఉంటే సుశాంత్ మృతి కేసులో రియా చ‌క్ర‌వ‌ర్తికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ (ఈడీ) స‌మ‌న్లు జారీ చేసింది. మ‌నీల్యాండ‌రింగ్ చ‌ట్టం కింద రియాకు స‌మ‌న్లు జారీచేసిన ఈడీ..ఆగ‌స్టు 7వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆదేశించింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo