మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Jun 18, 2020 , 14:54:47

సుశాంత్ సూసైడ్‌.. వాంగ్మూలం ఇచ్చిన రియా చ‌క్ర‌వ‌ర్తి

సుశాంత్ సూసైడ్‌.. వాంగ్మూలం ఇచ్చిన రియా చ‌క్ర‌వ‌ర్తి

హైద‌రాబాద్‌: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ‌పుత్ ముంబైలోని త‌న నివాసంలో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసులు విచార‌ణ‌ను వేగ‌వంగం చేశారు. సుశాంత్ స్నేహితురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి ఇవాళ ముంబై పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు సుశాంత్ స్నేహితులు, ఫ్యామిలీ స‌భ్యులు అంతా క‌లిసి ప‌ది మంది వ‌ర‌కు పోలీసు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. సుశాంత్ మ‌ర‌ణం విష‌యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. సుశాంత్‌కు ఎటువంటి ప్రొఫెష‌న‌ల్ శ‌త్రుత్వం లేద‌ని అత‌ని స్నేహితుడు ముఖేశ్ చ‌బ్బార్ పోలీసుల‌కు తెలియ‌జేశాడు. సుశాంత్ ఓ ఇంటెలిజెంట్ యాక్ట‌ర్ అని అత‌ను వెల్ల‌డించాడు. ఫిల్మ్ కెరీర్‌లో సుశాంత్‌తో స‌న్నిహితంగా ఉన్న‌వారంద‌రినీ విచారించ‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు. సుశాంత్ డిప్రెష‌న్‌లో ఉన్న‌ట్లు త‌న‌కు తెలియ‌ద‌ని తండ్రి పోలీసులకు తెలిపాడు. ఇంట్లోని వంట‌మ‌నిషి, కేర్‌టేక‌ర్‌, మేనేజ‌ర్ల వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.