మంగళవారం 14 జూలై 2020
Cinema - Jun 29, 2020 , 20:59:20

ఆర్జీవీ షార్ట్ ఫిలింకు రూ.8 ల‌క్ష‌లు వ‌సూళ్లు..!

ఆర్జీవీ షార్ట్ ఫిలింకు రూ.8 ల‌క్ష‌లు వ‌సూళ్లు..!

హైద‌రాబాద్ : సినీ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ మేకింగ్ స్టైల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఒక్క సినిమా విడుద‌ల‌య్యే లోపే మ‌రో మూవీ విడుద‌లకు సిద్ద‌మ‌వుతుంది. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో సినిమాల విష‌యంలో చాలా మంది ద‌ర్శ‌క నిర్మాత‌లు డైలామాలో ప‌డ్డారు. అయితే వ‌ర్మ మాత్రం చాలా రిలాక్స్ గా త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. కరోనా విజృంభిస్తోన్న స‌మ‌యంలోనూ ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించి సినిమాలు చేస్తూ..ఓటీటీ ప్లాట్ ఫాంల‌లో విడుద‌ల చేస్తున్నాడు.

తాజాగా విడుద‌ల చేసిన నేక్ డ్ నంగా న‌గ్న‌మ్ షార్ట్ ఫిలింను 40వేల మంది వీక్షించార‌ట‌. టిక్కెట్ ధ‌రను రూ.200 గా నిర్ణ‌యించ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కు ఈ షార్ట్ ఫిలింకు రూ.8 ల‌క్ష‌లు క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసిన‌ట్లు టాక్‌. ఆర్జీవీ వ‌రల్డ్ లో విడుద‌లైన ఈ సినిమా భారీ లాభాల‌నే రాబ‌ట్టిన‌ట్లు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. ఓ వైపు కొంత‌మంది ఆర్జీవీ సినిమాలను వ్య‌తిరేకిస్తుంటే.. క‌రోనా విజృంభిస్తున్న విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో తాను మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడిన‌ని ఆర్జీవీ అంటున్నారు. logo