‘మర్డర్'లో ఎవరినీ చెడుగా చూపించడం లేదు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య ఆధారంగా ‘మర్డర్' పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్ర ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాపై ప్రణయ్ సతీమణి అమృత స్పందిస్తూ రాసినట్లుగా పేర్కొన్న ఓ నోట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ఆ లేఖ అమృత రాసినా లేదా ఆమె పేరుమీద అత్యుత్సాహంతో మరొకరు ప్రచారం చేసినా...వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందనిపించింది. ‘మర్డర్' చిత్రాన్ని నిజ జీవితకథ ఆధారంగా తీయబోతున్నానని చెప్పాను. అంతేకాని అదే నిజమైన కథ అని చెప్పలేదు. నేను తెరకెక్కించబోతున్న సినిమా తాలూకు వార్తలు వివిధ మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయి. సోషల్‌మీడియాలో నేను ఉపయోగించిన మారుతీరావు, అమృత, ప్రణయ్ ఫొటోలు అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎవరి దగ్గర రహస్యంగా పొందలేదు. ఈ కేసు జర్నలిస్ట్ దృష్టికోణంలో ఓరకంగా, పోలీస్ దృష్టికోణంలో మరో విధంగా ఉండొచ్చు. లేదా వివిధ మాధ్యమాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకోవచ్చు. అయితే దర్శకుడిగా ఓ సంఘటనపై నాదైన అవగాహన ఏమిటో తెలియజెప్పే హక్కు నాకుంది. ఎవరిని చెడుగా చూపించే ఉద్ధ్దేశ్యంతో ఈ సినిమా తీయడం లేదు. మనుషులు, వారి భావోద్వేగాలపై నాకు గౌరవం ఉంది’ అని రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు. ఇదిలావుండగా ఈ సినిమాపై అమృత స్పందించినట్లుగా సోషల్‌మీడియాలో ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదని ఆమె మామ బాలస్వామి తెలిపారు.
తాజావార్తలు
- నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
- రైతు సంఘాలతో కేంద్రం నేడు చర్చలు
- బాలానగర్ చెరువులో మృతదేహాలు
- గాజు సీసాలో జో బైడెన్..
- బెంగాల్లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
- విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్‌జాం
- నేడు ఉచిత ఆన్లైన్ జాబ్‌మేళా
- భూటాన్‌కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్’ గిఫ్ట్
- నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల
- లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం