ఆదివారం 07 జూన్ 2020
Cinema - Apr 01, 2020 , 13:03:09

ఆసక్తికరంగా ‘ఆర్జీవీ’ చిత్ర టైటిల్ లోగో..

ఆసక్తికరంగా ‘ఆర్జీవీ’ చిత్ర టైటిల్ లోగో..

హైదరాబాద్ : ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న  'ఆర్జీవీ' చిత్ర టైటిల్ లోగో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ..‘తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు’తన పిచ్చి ఇజంతో యువతను పెడత్రోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసఫి మీద సంధించిన రామబాణమే ఈ సినిమా అని,అందుకే రేపు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్ లోగో విడుదల చేశామన్నారు. 

చిత్ర సమర్పకులు వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ..కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే చిత్రీకరణ ప్రారంభిస్తామన్నారు. సామాజిక బాధ్యత లేని ఒక కుహనా మేధావి ఐడియాలజీ సమాజాన్ని ఎలా కలుషితం చేస్తుందో తెలిపేదే ఈ సినిమా అని చెప్పారు. సురేష్, రాశి, శ్రద్ధా దాస్, అమిత్, పునర్నవి భూపాలం, తేజ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టారస్ సినీకార్ప్ సమర్పణలో మాగ్నస్ సినీఫ్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు ఈ సినిమాను పొన్నూరి నిర్మిస్తున్నారు. 

సాంకేతికనిపుణులు:

ఛాయాగ్రహణం : వేదాంత్ మల్లాది, కూర్పు : కార్తీక శ్రీనివాస్ 

కళ : కృష్ణ చిత్తనూర్

పబ్లిసిటీ : ధనీ ఏలే

సంగీతం : వీణాపాణి

సమర్పణ : వెంకట శ్రీనివాస్ బొగ్గరం

నిర్మాత : బాల కుటుంబ రావు పొన్నూరి

కధ, మాటలు, పాటలు, చిత్రానువాదం, దర్శకత్వం : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo