గురువారం 28 మే 2020
Cinema - May 14, 2020 , 18:07:46

రామ్ గోపాల్ వ‌ర్మ క్లైమాక్స్ టీజ‌ర్ విడుద‌ల‌

రామ్ గోపాల్ వ‌ర్మ క్లైమాక్స్ టీజ‌ర్ విడుద‌ల‌

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మరోసారి శృంగార తార మియా మాల్కోవాతో కలిసి ష్టార్ట్‌ ఫిలిమ్ తీస్తున్నట్లు రీసెంట్‌గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. క్లైమాక్స్ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ షార్ట్ ఫిలిం టీజ‌ర్‌ని కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఇందులో మియా త‌న విశ్వ‌రూపాన్ని చూపింది. ఎడారిలో సెక్సీగా క‌నిపించి యూత్ హృద‌యాల‌ని కొల్ల‌గొట్టింది

ఈ విపత్కర పరిస్థితుల్లో లాక్ డౌన్ దయతో నేను మియా మాల్కోవా మిమ్మల్ని సంద‌డి చేసేందుకు క్లైమాక్స్స టీజ‌ర్‌తో వ‌చ్చాం అని చెప్పుకొచ్చాడు వ‌ర్మ‌. మే 18న ఉద‌యం 9.30ని.లకి క్లైమాక్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నాడు. లాక్ డౌన్ కారణంగా క్లైమాక్స్‌ని ఆన్ లైన్ లో డైరెక్షన్ చేసి తెరకెక్కించారని అంటున్నారు. ఇప్పటికే ఆయన మియా మాల్కోవాలతో జీఎస్టీ (గాడ్ సెక్స్ ట్రూత్ )పేరుతో షార్ట్ ఫిలిం తీసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనమైంది.


logo