బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 18, 2020 , 00:09:13

ఆర్జీవీ బయోపిక్‌ పార్ట్‌-1 ప్రారంభం

ఆర్జీవీ బయోపిక్‌ పార్ట్‌-1 ప్రారంభం

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ బయోపిక్‌ మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు నిర్మాత బొమ్మాకు మురళి. దొరసాయి దర్శకుడు.  ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పార్ట్‌ షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రామ్‌గోపాల్‌ వర్మ తల్లి సూర్యవతి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, ఆర్టీవీ సోదరి విజయ క్లాప్‌నిచ్చారు. ఈ చిత్రంలో దొరసాయి తేజ టీనేజ్‌ రామ్‌గోపాల్‌ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ తొలిభాగంలో వర్మ కాలేజ్‌ రోజులు, తొలిప్రేమలు, గ్యాంగ్‌ఫైట్స్‌తో మొదలై తొలి సినిమా ‘శివ’ దర్శకత్వం వరకు కథాంశంగా చూపించనున్నామని, టాలీవుడ్‌, బాలీవుడ్‌లో వర్మ ప్రయాణంలోని అన్ని కోణాలను ఆవిష్కరిస్తామని నిర్మాత తెలియజేశారు.


logo