మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Oct 02, 2020 , 02:03:47

శర్వానంద్‌ చిత్రం పునఃప్రారంభం

శర్వానంద్‌ చిత్రం  పునఃప్రారంభం

శర్వానంద్‌ కథానాయకుడిగా శ్రీకార్తీక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ చెన్నైలో పునఃప్రారంభమైంది. రీతూవర్మ కథానాయిక. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా  శర్వానంద్‌ మాట్లాడుతూ ‘లాక్‌డౌన్‌ తర్వాత మళ్లీ కెమెరా ముందుకురావడం తాజా గాలిని పీలుస్తున్నంత ఆనందంగా ఉంది. సరికొత్త కథతో ఈ సినిమా సిద్ధమవుతోంది. అన్ని వర్గాలను అలరిస్తుంది’ అన్నారు. అమల అక్కినేని, ప్రియదర్శి, వెన్నెల కిషోర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మిస్తున్నారు.


logo