ఆదివారం 31 మే 2020
Cinema - Apr 27, 2020 , 08:08:34

పోలీసుల‌ని మ‌నం ఎంతో గౌర‌వించాలి: మ‌ంచు విష్ణు

పోలీసుల‌ని మ‌నం ఎంతో గౌర‌వించాలి: మ‌ంచు విష్ణు

క‌రోనా క‌ట్ట‌డి కోసం రేయింబ‌వ‌ళ్ళు నిద్రాహారాలు మాని క‌ష్ట‌ప‌డుతున్న అత్య‌వ‌స‌ర సేవా సిబ్బంది దేవుళ్ళ క‌న్నా ఎక్కువ అంటున్నారు. అయితే కొంద‌రు మాద్రం వైద్యుల‌పై దాడులు చేస్తూ భ‌యానక వాతావ‌ర‌ణం సృష్టిస్తున్నారు. దీనిపై మంచు విష్ణు మాట్లాడుతూ.. క‌రోనా సంక్షోభంలో ఉన్న మ‌న‌ల్ని  ర‌క్షించేందుకు వైద్యులు, పోలీసు సిబ్బంది ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇప్పుడు వారితో గొడ‌వ‌లు ప‌డ‌డం, దాడి చేయ‌డం చాలా దుర‌దృష్ట‌క‌రం అని విష్ణు అన్నారు.

మ‌న కోసం వాళ్ళ ప్రాణాల‌ని సైతం లెక్క చేయ‌కుండా పని చేస్తున్న వైద్యులు, పోలీసుల‌పై ప్రేమ‌, క‌రుణ‌తో ఉండాలి. కృత‌జ్ఞ‌త చూపించాలి. వారు వాళ్ళ కుటుంబాల‌కి దూరంగా ఉంటూ మ‌న‌ల్ని కాపాడ‌టానికి ఎంతో శ్ర‌మిస్తున్నారు. వారిని మ‌నం గౌర‌వించాలే త‌ప్ప దాడులు చేయ‌కూడ‌ద‌ని మంచు విష్ణు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం  ‘మోసగాళ్లు’ సినిమాతో బిజీగా ఉండ‌గా ఈ  మూవీలో కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి మరో రెండు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. టెర్రిఫిక్ స్టోరీ, క్యారెక్టరైజేషన్, యాక్షన్ మేళవిపుంతో తయారవుతున్న ‘మోసగాళ్లు’ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు.logo