చేసే పని మీద గౌరవం ఉంటే అదే పేరు, డబ్బు సంపాదించిపెడుతుందనే సిద్ధాంతాన్ని తాను విశ్వసిస్తానని అంటోంది మిత్రశర్మ. ఆమె కథానాయికగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘బాయ్స్’. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దయానంద్ దర్శకుడు. నేడు మిత్రశర్మ జన్మదినం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నటన, సినిమాలపై మక్కువతో ముంబయి నుంచి హైదరాబాద్‌కు వచ్చా. అవకాశాల కోసం చాలా సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. నాలా సినిమా ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఆలోచనతో ‘బాయ్స్’ చిత్రాన్ని నిర్మించాను. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని ఈ సినిమా కోసమే వెచ్చించాను. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. కాలేజీ జీవితంలో కొందరు యువతీయువకులకు ఎదురైన అనుభవాలతో నవ్విస్తూనే హృదయాల్ని కదిలిస్తుంది. రాహుల్ సింప్లిగంజ్ ఆలపించిన పాటకు చక్కటి స్పందన లభిస్తోంది’ అని తెలిపింది.