17వ రోజు క్రాక్ సంచలనం..రిపబ్లిక్ డే స్పెషల్..!

రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. ఇప్పటికే దాదాపు 35 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. ఇన్ని సంవత్సరాల రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కోవిడ్ సమయంలో రావడం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది అభిమానులకు. ఇప్పటి వరకు మాస్ రాజా కెరీర్ లో 30 కోట్లు దాటిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు ఆ లోటు క్రాక్ సినిమా పూర్తి చేసింది. విడుదలైన 16 రోజుల తర్వాత కూడా ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుంది క్రాక్. ముఖ్యంగా జనవరి 26 రవితేజ పుట్టినరోజు..పైగా పబ్లిక్ హాలిడే కూడా కావడంతో ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ఈ రోజుల్లో ఒక వారం సినిమా ఆడితేనే అద్భుతం అంటున్నారు. అలాంటి రెండు వారాల తర్వాత కూడా క్రాక్ మంచి వసూళ్లు తీసుకొస్తుంది.
దానికితోడు కరోనా వైరస్ ఉన్నా కూడా ప్రేక్షకులు దాని గురించి మర్చిపోయారు. థియేటర్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ విషయంలో క్రాక్ సినిమా పాత్ర కూడా చాలానే ఉంది. విడుదలైన 17వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 1.25 కోట్ల షేర్ తీసుకువచ్చింది ఈ సినిమా. సెలవు రోజు కావడంతో ప్రేక్షకులు థియేటర్ల వైపు కదిలారు. దాంతో సినిమాకు కలెక్షన్ల కుంభవృష్టి కురిసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 34 కోట్ల షేర్ అందుకుంది క్రాక్. కేవలం 16 కోట్ల బిజినెస్ మాత్రమే చేసిన ఈ సినిమా ఇప్పటికే 20 కోట్ల లాభాలు అందుకుంది.
పైగా డిజిటల్ రైట్స్ కూడా భారీగానే అమ్ముడయ్యాయి. ఈ సినిమాను జనవరి 29న ఆహాలో విడుదల చేయాలని అల్లు అరవింద్ వర్గం నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటికీ కలెక్షన్స్ బాగానే ఉండటంతో మరో వారం పోస్ట్ ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆహా యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది బయటికి రాలేదు. కానీ క్రాక్ వసూలు మాత్రం ఓ రేంజ్ లో వస్తున్నాయి. 17 రోజుల తర్వాత కూడా కోటి రూపాయలకు పైగా షేర్ తీసుకురావడం చిన్న విషయం కాదు. ఈ ఒక్క సాక్ష్యం చాలు థియేటర్లకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి అని చెప్పడానికి.
ఇవి కూడా చదవండి..
వరుణ్ ధావన్ ఇక నటించడేమో..? 'జెర్సీ' భామ సెటైరికల్ పోస్ట్
లిప్‌లాక్ సీన్ కు లావణ్యత్రిపాఠి ఒకే..?
పూజాహెగ్డే డిమాండ్..మేకర్స్ గ్రీన్ సిగ్నల్..!
బాలీవుడ్ లోకి రవితేజ హీరోయిన్..!
తిరుమలలో త్రివర్ణ పతాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో
డైరెక్టర్ సాగర్ చంద్రనా లేదా త్రివిక్రమా..? నెటిజన్ల కామెంట్స్
కీర్తిసురేశ్ ఏడేళ్ల కల నెరవేరింది..!
సెట్స్‌లో పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కివీస్‌తో టీ20.. 50 రన్స్ తేడాతో ఆసీస్ విజయం
- తాండవ్ వివాదం : అమెజాన్ ప్రైమ్ ఇండియా హెడ్ అపర్ణా పురోహిత్‌కు బెయిల్!
- పంత్ హాఫ్ సెంచరీ.. ఆధిక్యంపై కన్నేసిన భారత్
- క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
- ప్రధాని గడ్డంపైనా అర్థంపర్థం లేని వ్యాఖ్యలు: కర్ణాటక సీఎం
- కిస్ సీన్లలో నటించేందుకు రెడీ అంటోన్న అమలాపాల్..!
- కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్
- రోజూ పెరుగు తింటే జీర్ణ సమస్యలు దూరం..!
- వర్చువల్‌గా భేటీకానున్న బైడెన్, మోదీ
- ప్రియుడితో పారిపోయిన కుమార్తె.. హత్య చేసిన తండ్రి