శనివారం 06 మార్చి 2021
Cinema - Jan 22, 2021 , 10:21:18

మంచి మీల్, ప్రేమానురాగాలు ఉంటే చాలు: రేణూ దేశాయ్

మంచి మీల్, ప్రేమానురాగాలు ఉంటే చాలు:  రేణూ దేశాయ్

పూరీ జ‌గన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బ‌ద్రి సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రేణూ దేశాయ్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు గుడ్‌బై చెప్పింది.ప్ర‌స్తుతం ద‌ర్శ‌కురాలిగా, నిర్మాతగా, న‌టిగా త‌న స‌త్తా చూపించేందుకు స్కెచ్‌లు వేస్తుంది రేణూ. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ త‌ర‌చు త‌న అభిమానుల‌తో ముచ్చ‌టిస్తూ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డిస్తూ ఉంటుంది. తాజాగా కొన్ని ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. త‌న‌కు మంచి మీల్‌, ప్రియ‌మైన వారి ప్రేమ ఉంటే చాలు . జీవితాంతం సంతోషంగా ఉంటాన‌ని పేర్కొంది. రేణు దేశాయ్ చెప్పిన మాట‌లు ప్ర‌స్తుతం అభిమానుల‌ని ఆలోజింప‌జేస్తున్నాయి. కాగా, ప‌వ‌న్ క‌ళ్యాన్ నుండి విడిపోయిన త‌ర్వాత పూణేలో పిల్ల‌ల‌తో క‌లిసి ఉంటున్న రేణూ దేశాయ్ అప్పుడ‌ప్పుడు ప‌నిమీద హైద‌రాబాద్‌కు వ‌స్తుంటుంది. ప‌లు షోల‌లో మెరుపుతీగ‌లా మెరిసి వెళ్ళ‌డం, కొన్ని రియాలిటీ షోస్‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించడం చేస్తుంది.

  

VIDEOS

logo