పవన్ కళ్యాన్ మాజీ భార్య రేణూ దేశాయ్ కొన్నేళ్ల సంసారం తర్వాత అతనికి విడాకులు ఇచ్చి పిల్లలతో పూణేలో ఉంటున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న రేణూ 2018లో తాను మరో వ్యక్తిని ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్టు తెలియజేస్తూ ఎంగేజ్మెంట్ రింగ్ ధరించిన ఫొటో కూడా షేర్ చేసింది. ఇది చూసి పవన్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆమెను తెగ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.దీనికి రేణూ దేశాయ్ కూడా గట్టిగానే బదులిచ్చింది అనుకోండి.
తాజాగా రేణూ దేశాయ్ తన సోషల్ మీడియాలో చేతికి రింగ్ ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. ఈ ప్రపంచంతో పనిలేదు. ఫీల్ హ్యాపీనెంగ్ అనే కామెంట్ పెట్టింది. ఈ రింగ్ చూసి మళ్లీ మెగా ఫ్యాన్స్ రేణూదేశాయ్‌కు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఓ నెటిజన్.. పవన్ కళ్యాణ్ గిఫ్ట్‌గా ఇచ్చారా అని కామెంట్ పెట్టగా, దానికి రేణూ దేశాయ్.. విడాకులు తీసుకున్న తర్వాత ఆయన ఎందుకు గిఫ్ట్‌గా ఇస్తారు. కొంత సెన్సిబుల్‌గా ఆలోచించండి. నా సొంత డబ్బులతో కొనుక్కున్నా అని రేణూ పేర్కొంది.