రేణు దేశాయ్‌ను ఏడిపించిన యాంకర్ సుమ..అసలు కారణం ఇదే!

రేణు దేశాయ్ బర్త్ డే సందర్భంగా యాంకర్ సుమను ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ఆ వీడియోను తన యూ ట్యూబ్ ఛానెల్ సుమక్కలో ప్రసారం చేసింది. అందులో ప్రతీవారం సెలబ్రిటీలను పిలిచి వాళ్ల మనోభావాలను ప్రేక్షకులకు తెలియజేస్తున్నది. రేణు దేశాయ్‌ను కూడా పిలిచి ఆమెను నవ్విస్తూనే.. చాలా విషయాల గురించి ఆరా తీసింది సుమ.
అయితే అప్పటి వరకు నవ్వుతూనే మాట్లాడిన రేణు మధ్యలో తన పిల్లలు ఆద్య, అకీరాల టాపిక్ వచ్చేసరికి ఏడ్చేసింది. 'బెస్ట్ మామ్ ఎవర్' అంటూ ఓ టీ కప్పుపై పిల్లలతో దిగిన ఫోటోను వేసి దేశాయ్‌కి గిఫ్ట్‌గా ఇచ్చింది సుమ. అది చూసి ఎమోషనల్ అయింది రేణు. తనకు ఆద్య, అకీరాలే లోకం అని.. వాళ్లే తన సర్వస్వం అని చెప్పింది. తనకంటూ ప్రత్యేకమైన ప్రపంచం అంటూ ఏం లేదని.. పిల్లలే భవిష్యత్తు.. వాళ్లకు మంచి జీవితం ఇవ్వడమే తన ముందున్న ధ్యేయం అంటుంది రేణు.
తన పిల్లల గురించి చెప్తూనే ఎమోషనల్ అయింది. వాళ్లు ఎక్కడికైనా బయటికి వచ్చినపుడు లేదంటే, పవన్ వేడుకల్లో కనిపించినపుడు వాళ్ల పద్దతుల గురించి తనకు ఫోన్ చేసి దర్శకులు, నిర్మాతలు చెప్తుంటారని తెలిపింది. వాళ్లు చాలా పద్దతిగా ఉంటారని.. అందరితోనూ ఈజీగా కలిసిపోతారని చెప్తుంటే ఒక తల్లిగా తనకు చాలా గర్వంగా ఉంటుందని చెప్పింది. తనకు ఈ జీవితానికి ఇంతకంటే ఏం కావాలంటూ కన్నీరు పెట్టుకుంది. ఇదిలా ఉంటే త్వరలోనే టాలీవుడ్లో నటిగా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. దాంతో పాటు రైతుల కథాంశంతో ఓ సినిమాను డైరెక్ట్ కూడా చేయనుంది.
తాజావార్తలు
- తెలంగాణలో 1150 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులు
- ఐపీఎల్ వేలం.. క్వారంటైన్ అవసరం లేదు కానీ..
- భార్యపై అనుమానంతో కూతురు ఉసురుతీశాడు
- మితిమీరిన కామోద్రేకం.. శృంగారం చేస్తూ వ్యక్తి మృతి
- ఆ బిల్లులు రైతులకు అర్థం కాలేదు : రాహుల్ గాంధీ
- పోలీసులను పరామర్శించనున్న హోంమంత్రి అమిత్ షా
- క్రికెటర్ శిఖర్ ధావన్‌పై ఛార్జిషీట్
- టెన్త్ అర్హతతో రైల్వేలో 374 అప్రెంటిస్‌లు
- దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు : రాహుల్
- బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టిన తాప్సీ