గురువారం 13 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 23:58:13

భవిష్యత్తు తరాల కోసం గ్రీన్‌ చాలెంజ్‌

భవిష్యత్తు తరాల కోసం గ్రీన్‌ చాలెంజ్‌

పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ ఎంపీ     సంతోష్‌కుమార్‌ ఆరంభించిన మూడోవిడత గ్రీన్‌చాలెంజ్‌కు చిత్రసీమ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. యాంకర్‌  ఉదయభాను ఇచ్చిన చాలెంజ్‌ను స్వీకరించిన సీనియర్‌ కథానాయిక రేణు దేశాయ్‌ తన కూతురితో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పార్కులో మొక్కలు నాటారు. ఆమె మాట్లాడుతూ ‘ఇప్పుడు నాటే మొక్కల వల్ల భవిష్యత్తు తరాలు ఫలాల్ని అందుకుంటాయి. నేటితరం వారికి పర్యావరణం గురించి సరైన అవగాహన ఉండటం లేదు. అందుకే నా కూతురు ఆద్య..తన స్నేహితురాలు యషికను ఇక్కడకు తీసుకొచ్చి మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాల్ని వివరించాను. ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా నిర్వర్తిస్తున్న ఎంపీ సంతోష్‌కుమార్‌గారిని అభినందిస్తున్నా’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కోఫౌండర్‌ రాఘవ, ప్రతినిధి కిషోర్‌గౌడ్‌ పాల్గొన్నారు.


logo