బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 23:39:16

నిజం కోసం అన్వేషణ

నిజం కోసం అన్వేషణ

బద్రి, జానీ చిత్రాల్లో కథానాయికగా నటించింది రేణుదేశాయ్‌. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె సుదీర్ఘ విరామం తర్వాత నటిగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టబోతున్నది. ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘ఆద్య’. డి.ఎస్‌.రావ్‌, ఎస్‌.రజనీకాంత్‌ నిర్మించనున్నారు. ఎం.ఆర్‌.కృష్ణ మామిడాల దర్శకుడు. తేజ కూరపాటి, గీతిక రతన్‌, సాయిధన్సిక, నందినిరాయ్‌ కీలక పాత్రల్ని పోషించనున్నారు. ‘పాన్‌ ఇండియన్‌ స్థాయిలో మహిళా ప్రధాన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతున్నది. ఓ మహిళా స్ఫూర్తివంతమైన ప్రయాణానికి దృశ్యరూపంగా ఉండబోతుంది. నిజం కోసం ఆమె సాగించిన అన్వేషణలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయన్నది ఆకట్టుకుంటుంది’ అని నిర్మాతలు చెప్పారు. వైభవ్‌ తత్వవాడి ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర. 


logo