ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 26, 2021 , 07:40:25

ప్రేమలో ఉన్న‌ట్టు ఒప్పుకున్న రేణూ దేశాయ్

ప్రేమలో ఉన్న‌ట్టు ఒప్పుకున్న రేణూ దేశాయ్

రేణూ దేశాయ్.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా సుప‌రిచితం. ప‌వ‌న్ నుండి విడిపోయిన త‌ర్వాత పూణేలో ఉంటున్న రేణూ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు ఎప్పుడు ట‌చ్‌లోనే ఉంటుంది. ఆ మ‌ధ్య తాను రెండో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు చిన్న హింట్ ఇచ్చింది రేణూ. దీంతో ప‌వ‌న్ అభిమానులు ఆమెపై విరుచుకుప‌డ్డారు. అత‌నిని చంపేస్తామంటూ బెదిరింపుల‌కు కూడా దిగారు. ఈ ప‌రిణామాల‌పై రేణూ ఫుల్ ఫైర్ అయింది. 

కొద్ది నెల‌ల‌ క్రితం త‌న‌కు ఎంగేజ్‌మెంట్ కూడా అయింద‌ని చెప్పుకొచ్చిన రేణూ మ‌ళ్ళీ ఆ టాపిక్ లేవ‌నెత్త‌డం లేదు.  అయితే ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న రేణూ దేశాయ్ తాను అఫీషియ‌ల్‌గా ప్రేమ‌లో ప‌డిన‌ట్టు చెప్పుకొచ్చింది. ఇంతకు రేణూ ఎవ‌రు  ప్రేమ‌లో ప‌డింది అంటే ఫ్లూటో అనే ఓ కుక్క పిల్ల‌తో. తాను ఆ కుక్క‌పిల్ల‌తో అధికారికంగా ప్రేమ‌లో ఉన్నానంటూ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. జంతు ప్రేమికురాల‌యిన‌ రేణూ దేశాయ్ ఇంట్లో పిల్లులుతో పాటు డాగ్స్ కూడా ఉన్నాయి. అప్పుడ‌ప్పుడు వాటిని త‌న అభిమానుల‌కు  ప‌రిచ‌యం చేస్తుంటుంది. 

VIDEOS

logo