ప్రేమ విఫ‌ల‌మైతే సూసైడ్ చేసుకోవ‌ద్దు: రేణూదేశాయ్

Nov 27, 2020 , 13:27:34

న‌టిగా, నిర్మాతగా,ద‌ర్శ‌కురాలిగా, మంచి వ‌క్త‌గా ఎంద‌రో ప్ర‌శంస‌లు అందుకున్నారు రేణూ దేశాయ్. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ నెటిజ‌న్స్‌తో త‌ర‌చు ముచ్చ‌టిస్తూ ఉంటుంది. వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బ‌దులిస్తూ ప‌లు సూచ‌న‌లు కూడా చేస్తుంది. తాజాగా ప్రేమ విఫ‌లమైతే సూసైడ్ చేసుకోవాల‌నే ఆలోచ‌న చేసే వారికి త‌గు సూచ‌న‌లు చేసింది.

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త‌న అభిమానుల‌తో ముచ్చ‌టించిన రేణూ దేశాయ్ ..ప్రేమ విఫ‌లం అయితే ఆ బాధ ఏ రేంజ్‌లో ఉంటుందో నాకు తెలుసు. ప్రేమించిన వ్య‌క్తి ప‌క్క‌న లేన‌ప్పుడు, మ‌నం మోస‌పోయాం అని అనిపించ‌న‌ప్పుడు ఆ బాధ వ‌ర్ణ‌నాతీతంగా ఉంటుంది. అయితే ఆ బాధ త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకోవ‌డం చాలా త‌ప్పు. ముందు జీవితం, ప్రాణం గురించి ఆలోచించాలి. అవ‌సర‌‌మైతే కౌన్సిలింగ్ తీసుకొని కుటుంబ స‌భ్యులు, స్నేహితుల సాయంతో ఆ బాధ నుండి బ‌య‌ట‌ప‌డొచ్చు అంటూ  రేణూ దేశాయ్ ప‌లు సూచ‌న‌లు చేసింది. 

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD