శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 15, 2021 , 11:29:59

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

లాక్‌డౌన్ త‌ర్వాత థియేట‌ర్ల‌కు జ‌నాలు వ‌స్తారా..? అన్న ప‌రిస్థితుల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ..ఎంట‌ర్ టైన్ మెంట్ అందించే సినిమాలను  ఆడియెన్స్ ఎప్పుడూ ఆద‌రిస్తార‌డానికి రవితేజ క్రాక్ చిత్ర‌మే ఉదాహ‌ర‌ణ‌. గోపీచంద్ మ‌లినేని-ర‌వితేజ కాంబోలో వ‌చ్చిన బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తూ సంక్రాంతి బ‌రిలో నిలిచి బ్లాక్‌బాస్ట‌ర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రానికి ఓ స్పెషాలిటీ ఉంది. ర‌వితేజ ఈ చిత్రానికి రూ.10 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఈ సారి రెమ్యున‌రేష‌న్ కాకుండా రెమ్యున‌రేష‌న్ ఫార్ములాను అప్లై చేశాడు ర‌వితేజ. ఇంత‌కీ రెమ్యున‌రేష‌న్ ఫార్ములా ఏంటనుకుంటున్నారా..?. సినిమాకు వ‌చ్చిన లాభాల్లో షేర్ తీసుకుని..రెమ్యునరేష‌న్ త‌గ్గ‌కుండా లాభాలు తీసుకోవ‌డం. ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ర‌వితేజ నైజాం ఏరియాలో రూ.6 కోట్లు, వైజాగ్ లో రూ.3.5 లాభాల‌ను తీసుకున్న‌ట్టు టాక్. దీని ప్ర‌కారం రవితేజ రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండానే రెమ్యున‌రేష‌న్ కు స‌రిప‌డే లాభాలు ఆర్జించాడ‌న్న‌మాట‌.

మొత్తానికి ఇన్నేళ్ల కెరీర్ లో స‌క్సెస్ కోసం ఆక‌లితో ఉన్న ర‌వితేజ‌కు క్రాక్ రూపంలో రెమ్యున‌రేష‌న్ ఫార్ములా వ‌ర్క‌వుట్ అయింద‌న్న‌మాట‌. ర‌వితేజ‌, శృతిహాస‌న్ కాంబోలో రెండోసారి వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్ తో ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతోంది. 

ఇవి కూడా చ‌ద‌వండి

జాక్వెలిన్ పోజుల‌కు ఇంటర్ నెట్ షేక్..ఫొటోలు వైర‌ల్‌

ఒకే ఫ్రేమ్‌లో 'వ‌రుడు కావ‌లెను' ఫ్యామిలీ

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

ఆర్ఆర్ఆర్ లో సముద్ర‌ఖనికి ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..?

బాలీవుడ్ సినిమాపై రామ్ క్లారిటీ..!

జాన్వీ క‌పూర్ షూటింగ్‌ను అడ్డుకున్న రైతులు

ప్ర‌భాస్ ' స‌లార్' కు ముహూర్తం ఫిక్స్


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo