గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 12, 2020 , 00:02:26

నిఖిల్‌కుమార్‌ రైడర్‌

నిఖిల్‌కుమార్‌  రైడర్‌

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘రైడర్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విజయ్‌కుమార్‌ కొండా దర్శకుడు. లహరి ఫిలిమ్స్‌ పతాకంపై చంద్రు మనోహరన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కశ్మీరా పరదేశి కథానాయిక.  శుక్రవారం  టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఫస్ట్‌లుక్‌లో శత్రువుల్ని ఎదురిస్తూ ధీరోదాత్తుడైన యువకుడిగా నిఖిల్‌కుమార్‌ కనిపిస్తున్నారు. ‘భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న చిత్రమిది. నిఖిల్‌ కుమార్‌ శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది’ అని చిత్రబృందం తెలిపింది.  దత్తన్న, అచ్యుతకుమార్‌, రాజేష్‌ నటరంగ, శోభరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌ జన్యా, సినిమాటోగ్రఫీ: శ్రీష ఎం కుడువల్లి. logo