గురువారం 24 సెప్టెంబర్ 2020
Cinema - Aug 15, 2020 , 18:39:08

మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ 'బీకామ్‌లో ఫిజిక్స్’ టీజర్ విడుదల

మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ 'బీకామ్‌లో ఫిజిక్స్’ టీజర్ విడుదల

హైదరాబాద్‌: ఏడు చేపల కథ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించి కమర్షియల్ సక్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు శ్యామ్ జే చైత‌న్య తాజాగా తన రెండో ప్రాజెక్ట్ గా ‘బీకామ్‌లో ఫిజిక్స్’ అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. బీకామ్‌లో ఫిజిక్స్ అనే టైటిల్‌తోనే అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ని తాజాగా రిలీజ్ చేశారు డైరెక్టర్ అండ్ కో. 

విభిన్న‌మైన టైటిల్స్ పెట్టి ఎట్రాక్ట్ చేయ‌డంలో దిట్ట శ్యామ్ జే చైత‌న్య‌. త‌ను అనుకున్న‌ది బోల్డ్‌గా ఎంట‌ర్‌టైన్ చేస్తూ చెప్పే శ్యామ్ బీకామ్‌లో ఫిజిక్స్‌కు కూడా అదే పంథాను కొనసాగించారు. టీజర్ ఆద్యంతం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నింపేశారు. ఏడుచేప‌ల క‌థ చిత్రంలో ఎంట‌ర్‌టైన్ చేస్తూ త‌ల‌సీమియా వ్యాధిపై చ‌ర్చించారు. ఇప్ప‌డు కూడా బ‌ర్నింగ్ ప్రాబ్లంని చాలా బోల్డ్‌గా ఎంట‌ర్‌టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రాన్ని రెడ్ కార్పెట్ రీల్ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో హిందీ, తెలుగు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. హిందీలో ఈ సినిమా కరణ్ జోహార్ అనే టైటిల్‌తో విడుదల అవుతుంది. 

న‌టీన‌టులు : అంకిత రాజ్‌పూత్‌, య‌శ్వంత్, నగ‌రం సునీల్‌, మేఘ‌నా చౌద‌రి, త‌దిత‌రులు

కెమెరా : ఆర్లి

ప్రొడక్షన్ డిజైన‌ర్‌ : స్వాధిన్ శ‌ర్మ‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ : పెరుమాళ్ మ‌లినేని

సంగీతం : ఏకె రిషాల్ సాయి, ఎంటీ క‌విశంక‌ర్‌

ఎడిట‌ర్‌ : శ్యాంస‌న్

సౌండ్ డిజైన‌ర్‌ : వ‌న‌జ‌కేశ‌వ్ స్టూడియో

సౌండ్ మిక్సింగ్‌ : క‌వి స్టూడియో జెర్మ‌నీ

క‌థ‌,మాట‌లు,స్క్రీన్‌ప్లే,నిర్మాత‌,ద‌ర్శ‌క‌త్వం : శ్యామ్ జే చైత‌న్య‌



logo