గురువారం 04 జూన్ 2020
Cinema - Jan 19, 2020 , 00:02:34

క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌

క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌

‘హైటెక్‌ లవ్‌', ‘బెస్ట్‌ లవర్స్‌' ఫేమ్‌ శ్రీ కరణ్‌ హీరోగా జినుకల హరికృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్నది. శ్రీ కరణ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై గొంటి శ్రీకాంత్‌, గుంజ శ్రీనివాసులు నిర్మిస్తున్నారు. నీలం ఠాకూర్‌ కథానాయిక.  ఫిబ్రవరిలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగుల్ని మిళితం చేసి రూపొందిస్తున్నాం. మాస్‌తో పాటు క్లాస్‌ ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది. శ్రీకరణ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ బాలాజీ, కెమెరా:రాము.
logo