మంగళవారం 26 మే 2020
Cinema - May 23, 2020 , 12:50:28

రెజీనా న్యూలుక్‌ అదిరింది!

రెజీనా న్యూలుక్‌ అదిరింది!

తమిళనాడుకు చెందిన రెజీనా కాసాండ్రా ‘ఎవరు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నది .. ఆచార్య సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ కూడా చేయనున్నది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నడుస్తుండడంతో షూటింగ్‌లకు బ్రేక్‌ పడింది. దీనితో సెలబ్రిటీలంతా ఇంటిపట్టునే ఉంటున్నారు.

క్వారెంటైన్‌లో హీరోయిన్లందరూ ఏం చేస్తున్నారో తెలుసు కాని రెజీనా మాత్రం ఎక్కడా తారసపడలేరు. సోషల్‌మీడియాలో సడన్‌గా న్యూ లుక్‌తో ప్రత్యక్షమైంది. పాతతరం హీరోయిన్‌లా మారిపోయిన రెజీనా ఫొటోలను ఇన్‌స్టాగ్గ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఫొటోలు చూసిన అభిమానులు ఈమె మా రెజీనాయేనా? అంటూ సందేహంగా కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఎందుకు మారిందని అభిమానులు ఖంగారు పడుతున్నారు. ఫోటోషూట్‌ కోసం అయింటుందిలే అని వారే జవాబిచ్చుకుంటున్నారు. ఏదైతేనేం రెజీనా ఏ గెటప్‌ వేసుకున్నా అందంగా ఉంటుంది.


logo