గత కొన్నేళ్లుగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటోంది చెన్నై సొగసరి రెజీనా. ప్రయోగాలకు ప్రాముఖ్యతనిస్తోన్న ఆమె ప్రతినాయిక ఛాయలున్న పాత్రల్లో సత్తాచాటుతోంది. తాజాగా ఆమె ఆర్కియాలజిస్ట్‌గా సరికొత్త అవతారంలో కనిపించబోతున్నది. రెజీనా కథానాయికగా కార్తిక్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నేనే నా’. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెజీనా యువరాణి, ఆర్కియాలజిస్ట్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆర్కియాలజిస్ట్ పాత్రకు సంబంధించిన రెజీనా లుక్‌ను ట్విట్టర్ ద్వారా చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో పురాతన శిలలను శోధిస్తూ ఆమె కనిపిస్తోంది. తన కెరీర్లో విభిన్నంగా నిలిచిపోయే పాత్ర అవుతుందని రెజీనా చెబుతోంది. తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.