రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఛత్రపతి మళ్లీ 16 ఏళ్ల తర్వాత బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి సమక్షంలో గ్రాండ్ గా సినిమా లాంఛ్ కూడా అయింది. అయితే ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ ఎవరు పోషిస్తారనే దానిపై రకరకాల పేర్లు తెరపైకి వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయాయి.
తాజాగా మరో భామ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ బ్యూటీ ఎవరో కాదు..రెజీనా కసాండ్రా. ఇప్పటికే సోనమ్ కపూర్ తో ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రెజీనా. ఛత్రపతి రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్..రెజీనాకు హిందీలో ఇది రెండో సినిమా కానుంది. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి..
మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా..!
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
వ్యాక్సిన్ వేయించుకున్న పూజాహెగ్డే.. స్టిల్ వైరల్