శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 01, 2020 , 03:09:42

నా తప్పు ఏమున్నదబ్బా

నా తప్పు ఏమున్నదబ్బా

“బ్లాక్‌ రోజ్‌' నా కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది.  నటిగా నన్ను కొత్త పంథాలో ఆవిష్కరించే సినిమా ఇది’ అని చెప్పింది ఊర్వశి రౌటేలా. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘బ్లాక్‌రోజ్‌'.   శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి  నిర్మిస్తున్నారు. సంపత్‌నంది క్రియేటర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మోహన్‌ భరద్వాజ్‌ దర్శకుడు. ఈ చిత్రంలోని ‘నా తప్పు ఏమున్నదబ్బా’ అనే వీడియోసాంగ్‌ను బుధవారం సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. తమన్‌ విడుదలచేశారు. ఈ పాటను సంపత్‌నంది రాశారు. మణిశర్మ సంగీతాన్ని  సమకూర్చగా హారిక నారాయణ్‌ ఆలపించారు. ఊర్వశి రౌటేలా మాట్లాడుతూ ‘అల్లు అర్జున్‌ డ్యాన్స్‌ను స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కించిన గీతమిది. చిత్రీకరణకు ముందు చాలా రిహార్సల్స్‌ చేశాం. ఆ సమయంలో పలుమార్లు గాయపడ్డాను. పాట తెరపై చూసుకొని ఆ కష్టమంతా మర్చిపోయాను’ అని చెప్పింది. ‘విచక్షణ, యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు  మరణానికి సంకేతమనే కౌటిల్యుడి అర్ధశాస్త్రంలోని పాయింట్‌ ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. మహిళా ప్రధాన ఇతివృత్తంతో భావోద్వేగభరితంగా ఉంటుంది. ఏకధాటిగా సాగిన సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాను పూర్తిచేశాం’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.