శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 17, 2021 , 14:04:52

స‌క్సెస్ మీట్ లో ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పిన రామ్‌

స‌క్సెస్ మీట్ లో ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పిన రామ్‌

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ న‌టించిన రెడ్ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రెడ్ రూ.10 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టిన‌ట్టు టాక్‌. రెడ్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ లో భాగంగా వైజాగ్ కు వెళ్లాడు. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి చెప్పుకొచ్చాడు. 15 ఏండ్ల క్రితం దేవ‌దాస్ చిత్రంతో నా కెరీర్ ప్రారంభించాను. ఈ మూవీ సంక్రాంతికే విడుద‌లైంది.

ఇన్నేళ్ల నా ప్ర‌యాణంలో..మీకు అస‌లైన పోటీ ఎవ‌రంటూ నా ఫాలోవ‌ర్లు (అభిమానులు) న‌న్ను అడిగారు. మీరు నాపై చూపుతున్న షర‌తులు లేని ప్రేమ ఎక్కువా లేదా మీ అంద‌రిపై నాకున్న ప్రేమ గొప్ప‌దా అన్న‌ది నిర్జయించుకోవ‌డానికి నేను మీతో పోటీ పడ‌తానంటూ చెప్పుకొచ్చాడు రామ్‌. ‌కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రెడ్ లో నివేదాపేతురాజ్‌, అమృతాఅయ్యార్, మాళవిక శ‌ర్మ హీరోయిన్లుగా న‌టించారు.

మ‌రిది కోసం సినిమా సెట్ చేసిన స‌మంత‌..!

కీర్తిసురేశ్ లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా..?

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo