శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 12:49:40

వైద్యుల‌కు కృత‌జ్ఞ‌తలు తెలిపిన త‌మ‌న్నా

వైద్యుల‌కు కృత‌జ్ఞ‌తలు తెలిపిన త‌మ‌న్నా

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా షూటింగ్‌లో పాల్గొన్న స‌మ‌యంలో క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే వైద్యుల స‌ల‌హాలు పాటిస్తూ ‌అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్న త‌మ‌న్నా త్వ‌ర‌గానే కోలుకుంది. ఈ విష‌యాన్ని కొద్ది రోజుల క్రితం పోస్ట్ ద్వారా తెలిపింది. తాజాగా ఈ అమ్మ‌డు త‌న పోస్ట్‌లో వైద్యుల‌తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ వారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలిపింది. 

కాంటినెంట‌ల్ ఆసుప‌త్రి వైద్యులు, న‌ర్సులు, సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపేందుకు మాట‌లు కూడా స‌రిపోవు. నేను చాలా బ‌ల‌హీనంగా, అనారోగ్యంతో ఉన్న‌ప్పుడు చాలా భ‌య‌ప‌డ్డాను. వారు నాకు ధైర్యాన్ని నూరిపోసి చికిత్స అందించారు.మీరు నాపై చూపిన ప్ర‌త్యేక శ్రద్ధ‌,  ద‌యాగుణం నేను త్వ‌ర‌గా కోలుకునేలా చేసింది అని త‌మ‌న్నా పేర్కొంది.