ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 18, 2020 , 17:03:23

రికార్డు సృష్టించిన 'బిగ్‌బాస్‌' 4 లాంచ్‌ రేటింగ్‌

రికార్డు సృష్టించిన 'బిగ్‌బాస్‌' 4 లాంచ్‌ రేటింగ్‌

హైదరాబాద్ : తెలుగు జనరల్‌ ఎంటర్‌టైన్‌మైంట్‌ చానళ్లలో "స్టార్‌ మా" నిరంతరాయంగా మొదటి స్థానంలో కొనసాగుతున్నది. బ్రాడ్ క్యాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్‌) గణాంకాల ప్రకారం బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 లాంచ్‌ అత్యధిక రేటింగ్స్‌ సాధించింది. రియాలిటీ షో లాంచ్‌లు సాధించిన అద్భుతమైన విజయాల్లో ఇది కూడా ఒకటి. ఈ సీజన్‌ ఒక సంచలనంతో మొదలైంది. బార్క్‌ విడుదల చేసిన లెక్కల ప్రకారం, అత్యద్భుతమైన ఆరంభ విజయంగా అభివర్ణించిన ఈ తొలివారం లాంచ్‌ని 4.5 కోట్ల మంది ప్రేక్షకులు చూశారు. ఈ సీజన్‌ బిగ్‌బాస్‌ లాంచ్‌ ఇంతకుముందెన్నడూ లేని రేటింగ్స్‌ సాధించింది. లాంచ్‌ ఎపిసోడ్‌ 18.5 టీవీఆర్‌ నమోదు చేసింది.

నాన్‌ ఫిక్షన్‌ షో కేటగిరీలో బార్క్‌ యూనివర్స్‌లో ఇప్పటివరకు రానంతగా అత్యధిక రేటింగ్స్‌ సాధించిన లాంచ్‌ ఎపిసోడ్‌గా మాత్రమే కాదు బిగ్‌బాస్‌ తెలుగు (తొలి సీజన్‌ నుంచి) చరిత్రలో ఏ సీజన్‌లోనూ చూడనంతగా ఈ లాంచ్‌ ఎపిసోడ్‌ అత్యుత్తమ రేటింగ్‌ సాధించింది. గణాంకాలను బట్టి స్టార్‌ మా గతంలో లేనంతగా అత్యధికంగా 1122 జీపీఆర్‌లతో తెలుగు జనరల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కేటగిరీలో స్పష్టమైన లీడర్‌షిప్‌ స్థానంలో కొనసాగుతోంది. గత నాలుగువారాలతో పోలిస్తే స్టార్‌ మా సరికొత్త బ్రాండ్‌ ఐడెంటిటీ 18 శాతం సాధించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo