e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News Anchor Ravi Elimination | రవి ఎలిమినేష‌న్‌కు అసలు కారణం తెలిసిపోయింది..!

Anchor Ravi Elimination | రవి ఎలిమినేష‌న్‌కు అసలు కారణం తెలిసిపోయింది..!

బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss Telugu Season 5)నుంచి యాంకర్ రవి (Anchor Ravi) ఎలిమినేట్ కావడంతో..ఆయన అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) గేటు ముందు ఆందోళన చేశారు. కావాలనే రవిని ఇంటి నుంచి బయటకు పంపేశారని..అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కు ప్రియాంక సింగ్ (Priyanka Singh), కాజల్ (RJ kajal) కంటే తక్కువ ఓట్లు ఎలా పడతాయి..మీరు ఓట్ల లెక్క చూపించండి..అప్పుడే మేము నమ్ముతాము అంటున్నారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం యాంకర్ రవిని కావాలనే ఎలిమినేట్ చేశారని తెలుస్తోంది. దానికి కారణం ఆయన భారీ పారితోషికం అని ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ 5 తెలుగు కంటెస్టెంట్స్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న వాళ్లలో రవి కూడా ఉన్నాడు.

ఇప్పటికే ఆయన 85 రోజులు ఇంట్లో ఉన్నాడు. దానికిగాను ఏకంగా 90 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో 20 రోజుల్లో ఆయన ఇంట్లో ఉంటే కచ్చితంగా 25 లక్షల వరకు పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది. అంటే బిగ్ బాస్ విన్నర్ కంటే కూడా రవి అత్యధిక పారితోషికం అందుకున్నట్లు లెక్క. ఇప్పటికే ఆయన ఖాతాలోకి విన్నర్ కంటే ఎక్కువ అమౌంట్ వచ్చింది. ఇంకా అతడిని ఇంట్లో ఉంచితే ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే.. బిగ్ బాస్ మూడు వారాల ముందే యాంకర్ రవిని ఎలిమినేట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

రవి కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటాడని అక్కడికి వచ్చిన వాళ్లతో పాటు బయట ప్రేక్షకులు కూడా అంచనా వేశారు. అలాంటి కంటెస్టెంట్ సడెన్ గా ఎలిమినేట్ అయిపోయాడు. ఇందులో కచ్చితంగా తిరకాసు ఉందని ముందు నుంచి అంటున్నారు అభిమానులు. ఇప్పుడు ఇవే అనుమానాలు నిజం అవుతున్నట్లు తెలుస్తోంది. కేవలం అత్యధిక పారితోషికం ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో ఆయన్ని భరించలేక బలవంతంగా బయటికి పంపించారనే ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి..


 ‘మీరు లేక ఏకాకి జీవితం మాది’..సిరివెన్నెల‌కు టాలీవుడ్ తార‌ల నివాళి

shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ

shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

Sirivennela | తొలి పాట‌కే ప్రేక్ష‌కుల గుండెల్లో చోటు

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement