శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 17:14:29

బాలీవుడ్ చాలా ఆల‌స్యంగా స్పందించింది: ట‌్విట‌ర్ లో వ‌ర్మ

బాలీవుడ్ చాలా ఆల‌స్యంగా స్పందించింది: ట‌్విట‌ర్ లో వ‌ర్మ

బాలీవుడ్ మురికి, డ్ర‌గ్స్ అడ్డా, వ‌ర‌ద కాలువ అంటూ.. అభ్యంత‌రం వ్యాఖ్య‌లు చేస్తూ అవ‌మానించార‌ని బాలీవుడ్ లోని 4 అసోసియేష‌న్లు, 34 నిర్మాణ సంస్థ‌లు రెండు టీబీ ఛానళ్లు, న‌లుగురు న్యూస్ యాంక‌ర్ల‌పై ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన సంగ‌తి తెలిసిందే. రిప‌బ్లిక్ టీవీ ఎడిట‌ర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి, రిపోర్టర్ ప్ర‌దీప్ భండారి, టైమ్స్ నౌ ఎడిట‌ర్ ఇన్ చీఫ్ రాహుల్ శివ‌శింక‌ర్, న‌వికా కుమార్ పేర్ల‌ను పిటిష‌న్ లో పేర్కొన్నారు.

అయితే బాలీవుడ్ ప్ర‌ముఖులు వేసిన దావాపై ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ త‌న‌దైన శైలిలో ట్వీట్ చేశాడు. 'బాలీవుడ్ ప్ర‌ముఖులు చాలా ఆల‌స్యంగా స్పందించారు. టాప్ ఫిల్మ్ సెల‌బ్రిటీలంతా ఇపుడు ఢిల్లీ హైకోర్టు ముందు స్కూల్ పిల్ల‌ల్లాగా నిల‌బ‌డి..టీచ‌ర్..టీచ‌ర్..అర్నాబ్ మ‌మ్మ‌ల్ని తిడుతున్నార‌ని ఫిర్యాదు చేసిన‌ట్టుంద‌ని' వ‌ర్మ ట్వీట్ చేశాడు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo