శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Dec 17, 2020 , 00:15:47

ఆర్థిక స్థిరతను కాపాడటంలోఆర్బీఐ సక్సెస్‌

ఆర్థిక స్థిరతను కాపాడటంలోఆర్బీఐ సక్సెస్‌

  • మాజీ గవర్నర్‌ దువ్వూరి ప్రశంస

న్యూయార్క్‌: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కొవిడ్‌-19 లాంటి పెను సంక్షోభాలను అధిగమించడం చాలా కష్టమని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో దేశ ఆర్థిక స్థిరతను కాపాడటంలో ఆర్బీఐ విజయవంతమైందని ఆయన కొనియాడారు. బుధవారం ఆయన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన వర్చువల్‌ ఈవెంట్‌లో ప్రసంగిస్తూ.. కరోనా కష్ట కాలంలో రిజర్వు బ్యాంకు చేపట్టిన చర్యలన్నీ ఆర్థిక సంక్షోభాన్ని నిరోధించి ఆర్థిక స్థిరతను కాపాడాలన్న లక్ష్యంతోపాటు ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదక రంగాలకు నిధులు సమకూర్చాలన్న లక్ష్యంతో చేపట్టినవేనని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఆర్బీఐ చేపట్టిన చర్యల్లో కొన్ని కీలక చర్యలున్నాయని, ఓపెన్‌ మార్కెట్‌ కార్యకలాపాల (ఓఎంవో) ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి అసాధారణ రీతిలో నగదును చొప్పించడం, నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)తోపాటు చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్‌)ని, రెపో, రివర్స్‌ రెపో రేట్లను తగ్గించడం, రుణాలపై మారటోరియంను ప్రకటించి దాన్ని పొడిగించడం లాంటివి ఈ చర్యల్లో ప్రధానమైనవని దువ్వూరి తెలిపారు. 

VIDEOS

logo