సోమవారం 25 జనవరి 2021
Cinema - Oct 22, 2020 , 16:43:50

ర‌యా అండ్ ద లాస్ట్ డ్రాగ‌న్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది...

ర‌యా అండ్ ద లాస్ట్ డ్రాగ‌న్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది...

హైద‌రాబాద్‌: డిస్నీ సంస్థ కొత్త యోధురాల్ని ప‌రిచ‌యం చేయ‌నున్న‌ది.  ర‌యా అండ్ ద లాస్ట్ డ్రాగ‌న్ సినిమా ట్రైల‌ర్‌ను ఆ సంస్థ రిలీజ్ చేసింది. వ‌చ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా రిలీజ్ కానున్న‌ది.  ఫ్రోజ‌న్‌, మోనా చిత్రాల‌ను తీసిన స్టూడియోనే ఈ సినిమాను రూపొందిస్తున్న‌ది.  కుముంద్ర లోకంలో మాన‌వులు, డ్రాగ‌న్లు క‌లిసే జీవించేవి. కానీ ఓ దుష్ట శ‌క్తి వ‌ల్ల సీన్ మారుతుంది. మాన‌వుల‌ను ర‌క్షించేందుకు డ్రాగ‌న్లు ప్రాణ త్యాగం చేస్తాయి. ఆ త‌ర్వాత 500 ఏళ్ల‌కు మ‌ళ్లీ ఆ దుష్ట‌శ‌క్తే వినాశ‌నానికి వ‌స్తుంది.  యోధురాలు ర‌యా ఒంట‌రిగా ఆ నీచుల్ని ఎదుర్కొంటుంది. అద్భుత‌మైన గ్రాఫిక్స్ వ‌ర్క్‌తో డిస్నీ యానిమేష‌న్ సంస్థ సినిమాను రూపొందిస్తున్న‌ది. ర‌యా పాత్ర‌కు కెల్లీ మేరీ స్వ‌రాన్ని అందించారు.logo