శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Mar 20, 2020 , 13:49:51

అవిశ్రాంతంగా పోరాడిన తల్లికి వంద‌నం: ర‌వితేజ‌

అవిశ్రాంతంగా పోరాడిన తల్లికి వంద‌నం: ర‌వితేజ‌

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన నిర్భ‌య అత్యాచారం, హత్య‌లో దోషులుగా ఉన్న నలుగురు నిందితుల‌ని ఈ రోజు తెల్ల‌వారుఝామున ఉరితీసిన విష‌యం తెలిసిందే. గ‌త ఏడేళ్ళుగా ఎన్నో కుయుక్తుల‌తో శిక్ష‌ని త‌ప్పించుకుంటూ వ‌స్తున్న దోషుల‌కి ఈ రోజు ఉరిశిక్ష విధించ‌డంతో దేశం మొత్తం హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంది. ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా దీనిపై స్పందిస్తున్నారు. కొద్ది సేప‌టి క్రితం ర‌వితేజ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. నిర్భ‌య దోషుల‌కి ఉరి వేసార‌న్న వార్త న‌మ్మ‌శ‌క్యంగా లేదు. ఏడు సంవత్సరాల తరువాత, నిర్భయ కేసు దోషులు చివరకు ఉరితీయబడ్డారు! న్యాయం కోసం  చాలా సంవత్సరాలు అవిశ్రాంతంగా పోరాడిన తల్లి మరియు న్యాయవాదికి నేను వందనం చేస్తున్నాను అని ర‌వితేజ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. నిర్భ‌య‌పై పాశ‌వికంగా ప్ర‌వ‌ర్తించిన దోషుల‌కి శిక్ష ప‌డే వ‌ర‌కు నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి, న్యాయవాది సీమా కుష్వాహా ఎంత‌గానో కృషి చేశారు. 


logo