శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 17, 2021 , 15:44:25

‘క్రాక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..మోత మోగిస్తోన్న ర‌వితేజ‌

‘క్రాక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..మోత మోగిస్తోన్న ర‌వితేజ‌

రవితేజ కెరీర్ చాలా రోజుల తర్వాత మళ్లీ ట్రాక్ ఎక్కింది. అది కూడా క్రాక్ సినిమాతో. బాక్సాఫీస్ దగ్గర ఈయన మోత మోగిస్తున్నాడు. ప్యాండమిక్ తర్వాత విడుదలై థియేటర్స్ లో సంచలన విజయం సాధించిన తొలి ఇండియన్ సినిమా ఇదే. 2017లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన రాజా ది గ్రేట్ సినిమా దాదాపు 30 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత రవితేజ సినిమాలు ఏవి కూడా కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేదు. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా సినిమాలు కనీసం 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. దానికంటే లోపలే ఉండిపోయాయి. దాంతో రవితేజకు మళ్లీ కారెక్టర్స్ కరెక్ట్.. సైడ్ హీరో అయిపోవాల్సిందే అంటూ విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో వచ్చింది క్రాక్. 

సంక్రాంతి పండగంతా మాస్ రాజాలోనే కనిపిస్తుంది. ఈయన సినిమా 10 కోట్లు కాదు వారం రోజుల్లోనే లాభాలు కూడా మొదలెట్టింది. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన క్రాక్.. కేవలం 7 రోజుల్లోనే లాభాల బాట పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 21. 50  కోట్లు షేర్ వసూలు చేసింది. గ్రాస్ దాదాపు 38 కోట్ల వరకు ఉంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం ముందు నుంచి కూడా పాజిటివ్ బజ్‌తోనే వచ్చింది. విడుదల సమయంలో కూడా కాస్త ఆలస్యం అయినా కూడా నైట్ షోస్ నుంచి రచ్చ మొదలైంది. కనీసం రోజుకు 2 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తుంది క్రాక్. ఇప్పటి వరకు 7 రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి క్రాక్ వసూలు చేసిన మొత్తం వివరాలు.. 

తొలిరోజు : Rs 6.54 కోట్లు

రెండో రోజు : Rs 3.15 కోట్లు

మూడో రోజు : Rs 2.86 కోట్లు

నాలుగో రోజు: Rs 2.69 కోట్లు

ఐదో రోజు: Rs 2.17 కోట్లు

ఆరో రోజు: Rs 2.38 కోట్లు

ఏడో రోజు: Rs 2.02 కోట్లు

7 రోజుల AP/TS కలెక్షన్స్ (షేర్) : Rs 21.50 కోట్లు ( 38.08 కోట్లు గ్రాస్)


మ‌రిది కోసం సినిమా సెట్ చేసిన స‌మంత‌..!

ఆర్మీ ఆఫీస‌ర్ గా సోనూసూద్..మ్యూజిక్ వీడియో

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo