శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Jan 13, 2021 , 19:35:44

ర‌వితేజ‌ 'ఖిలాడి' టీజ‌ర్ కు టైం ఫిక్స్..!

ర‌వితేజ‌ 'ఖిలాడి' టీజ‌ర్ కు టైం ఫిక్స్..!

ప్ర‌స్తుతం క్రాక్ సినిమా స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు టాలీవుడ్ యాక్ట‌ర్ ర‌వితేజ. ఈ చిత్రం సంక్రాంతి బ‌రిలో నిలిచి సూప‌ర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే ర‌వితేజ వెంట‌నే త‌న కొత్త సినిమా ఖిలాడీపై ఫోక‌స్ పెట్టాడు. ర‌మేశ్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ ప్రాజెక్టును శ‌ర‌వేగంగా పూర్తిచేయాల‌ని ప్లాన్ చేశార‌ట మేక‌ర్స్. ఓ వైపు క్రాక్ స‌క్సెస్ తో సంబురాలు చేసుకుంటున్న ర‌వితేజ అభిమానుల‌కు గుడ్‌న్యూస్.

జ‌న‌వ‌రి 26న ర‌వితేజ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఖిలాడి టీజ‌ర్ ను విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ఫిక్స‌యిన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఈ చిత్రంలో డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. వేస‌విలో చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోనేరు స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. 

2020లో క‌రోనాతో విశ్రాంతి తీసుకున్న ర‌వితేజ ఈ సారి మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. అంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ స్పెష‌ల్ పోస్ట‌ర్ ను ట్విట‌ర్ లో షేర్ చేశాడు ర‌వితేజ‌.

ఇవి కూడా చ‌ద‌వండి

త్రివిక్ర‌మ్ తో నా సినిమా ప‌క్కా ఉంట‌ది: రామ్

త్రివిక్ర‌మ్‌తో సినిమాపై రామ్ స్పంద‌న ఏంటి?

12 కి.మీ సైకిల్ తొక్కిన‌ ర‌కుల్‌..ఎందుకంటే..?

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?

నా ఫేవ‌రేట్ హీరో టాప్ ఫాంలో ఉన్నారు: రాంచ‌ర‌ణ్

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo