‘జీవితంలో డబ్బు మాత్రమే ముఖ్యమని నమ్ముతాడో యువకుడు. అనుబంధాలే గొప్పవని మరో వ్యక్తి విశ్వసిస్తాడు. ఒకే పోలికలతో ఉండే ఆ ఇద్దరిలో ఎవరి నమ్మకం గెలిచిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అని అంటున్నారు రమేష్‌వర్మ. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. రవితేజ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలు. టాకీపార్ట్ పూర్తయినట్లు శుక్రవారం చిత్రబృందం ప్రకటించింది. నిర్మాత మాట్లాడుతూ ‘నవ్యమైన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. రెండు భిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రల్లో రవితేజ కనిపిస్తారు. నవ్విస్తూనే సినిమా థ్రిల్‌ను పంచుతుంది. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్, జీకే విష్ణు.