శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 16, 2021 , 20:09:54

జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?

జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?

మాస్ మహారాజా రవితేజ న‌టించిన‌ క్రాక్ సినిమా ప్రస్తుతం థియేటర్ల‌లో   మంచి వసూళ్లు సాధిస్తున్న‌ది. విడుదలైన వారం రోజుల్లోనే సినిమా దాదాపు 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అది కూడా కేవలం 50 ఆక్యుపెన్సీతోనే. 100 శాతం ఉండుంటే కచ్చితంగా ఇప్పటికే 30 కోట్ల షేర్ దాటిపోయేది.   సినిమాలు విడుదలైన  కొద్దిరోజుల్లోనే ఓటిటిలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు   నిర్ణయించుకుంటున్నారు . ఈ మేరకు ముందుగానే ఒప్పందం కూడా చేసుకున్నారు. ఆ మధ్య డిసెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా థియేటర్స్ లో విడుదలైంది. వారం రోజుల తర్వాత అంటే జనవరి 1న ఈ సినిమా ఓటిటిలో విడుదల చేశారు.   

జీ స్టూడియోస్ ఈ సినిమాను న్యూ ఇయర్ కానుకగా విడుదల  చేసింది.   ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజ క్రాక్ సినిమా విషయంలో కూడా   ఇదే జ‌రుగ‌బోతోంది.   ఈ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధిస్తుండటంతో ఓటిటిలో కాస్త ఆలస్యంగా రానుంది. ఒకవేళ థియేటర్స్ లో సరైన రెస్పాన్స్ రాకపోయుంటే కచ్చితంగా ఒకటి లేదా రెండు వారాల్లోనే సినిమాను ఓటిటిలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారు దర్శక నిర్మాతలు. ఎందుకంటే మంచి వసూళ్లతో దూసుకుపోతుండటంతో మరో రెండు వారాల తర్వాత ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమాను జనవరి 26న రవితేజ బర్త్ డే సందర్భంగా ఓటిటిలో విడుదల చేయాలనుకుంటున్నారు.   ఆహా ఓటీటీ సంస్థ ఈ సినిమాను భారీ రేట్ కు సొంతం చేసుకున్న‌ది.    దాదాపు 10 కోట్లకు క్రాక్ సినిమా రైట్స్ సొంతం చేసుకుంది ఆహా. అయితే మరీ అంత త్వరగా ఓటిటి విడుదల చేస్తే కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు అభిమానులు. కానీ అలాంటిదేం ఉండదని.. అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని క్రాక్ రిలీజ్ ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు.

ఇవీ చదవండి:

సోనూసూద్ టైల‌రింగ్ షాప్‌

రామ్‌ చరణ్‌, రోజా.. ఇద్దరూ ఇష్టపడేది ఆ హీరోనే

ప్రభాస్‌ ‘సలార్‌’ లేటెస్ట్‌ అప్‌డేట్‌.. హీరోయిన్‌.. విలన్‌ ఎవరో తెలుసా?

 సంక్రాంతి సినిమాల పరిస్థితేంటి?

VIDEOS

logo