రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడి’. ‘ప్లే స్మార్ట్’ ఉపశీర్షిక. రమేష్‌వర్మ దర్శకుడు. సత్యనారాయణ కోనేరు నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలు. ఈ చిత్ర టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. పవర్ఫుల్ యాక్షన్ అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఎమోషన్స్, థ్రిల్లింగ్స్ ఎలిమెంట్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ప్రియురాలి ప్రేమలో ఉన్న కథానాయకుడు ఆమెను హత్య చేయడానికి యత్నించడం ఎందుకన్నది టీజర్లో సస్పెన్స్‌ను పంచింది. ‘ఇఫ్ యూ ప్లే స్మార్ట్ వితౌట్ స్టుపిడ్ ఎమోషన్స్.. యూ ఆర్ అన్‌స్టాపబుల్’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. అర్జున్, థాకూర్ అనూప్‌సింగ్, మురళీశర్మ, అనసూయ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థలు: ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్, హవీష్ ప్రొడక్షన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్‌వర్మ.
ఇవీ కూడా చదవండి…
అన్నీ అబద్ధాలే.. ఓటీటీలోకి వకీల్ సాబ్ అప్పుడే రాదు