శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Apr 02, 2020 , 23:25:00

కిరాక్‌ పోలీస్‌

కిరాక్‌ పోలీస్‌

రవితేజ, శృతిహాసన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్‌'. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌ పతాకంపై బి. మధు నిర్మిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది. ఈ పోస్టర్‌లో శృతిహాసన్‌తో పాటు చిన్నారిని చేతులపై ఎత్తుకొని రవితేజ కనిపిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. ‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. కుటుంబ విలువలకు ప్రాధాన్యముంటుంది. అన్యాయాల్ని ఎదురించే నిజాయితీపరుడైన పోలీస్‌ అధికారిగా రవితేజ కనిపించబోతున్నారు. రవితేజ, శృతిహాసన్‌ కలయికలో వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది’ అని చిత్రబృందం తెలిపింది. సముద్రఖని, వరలక్ష్మిశరత్‌కుమార్‌, దేవీప్రసాద్‌, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న  ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌.


logo