శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 23:35:20

లాయర్‌గా రవితేజ?

లాయర్‌గా రవితేజ?

ఈ ఏడాది ఆరంభంలో ‘ప్రతిరోజు పండగే’ చిత్రం ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు మారుతి. ప్రస్తుతం ఆయన రవితేజ కథానాయకుడిగా ఓ సినిమాను తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు. దర్శకుడు మారుతి తన సినిమాల్లో వినోదం, కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేస్తుంటారు. అయితే రవితేజతో రూపొందించనున్న  చిత్రంలో తన పంథాకు భిన్నంగా సామాజిక సందేశం ఉన్న కోర్ట్‌రూమ్‌ డ్రామా కథాంశాన్ని ఎంచుకున్నారని సమాచారం. ఈ సినిమాలో రవితేజ లాయర్‌ పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. సోషల్‌మెసేజ్‌ ఉన్న ఇతివృత్తమైనప్పటికి మారుతి శైలి వినోదాంశాలు పుష్కలంగా ఉంటాయని తెలిసింది. జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.


logo