మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 23:29:56

‘ఖిలాడి’ మొదలైంది

‘ఖిలాడి’ మొదలైంది

రవితేజ కథానాయకుడిగా రమేష్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఖిలాడి’. ‘ప్లే స్మార్ట్‌' ఉపశీర్షిక. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతీలాల్‌ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ  నిర్మిస్తున్నారు. మీనాక్షిచౌదరి, డింపుల్‌ హయతి కథానాయికలు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ  చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.  ముహూర్తపు సన్నివేశానికి హీరో హవీష్‌ క్లాప్‌నివ్వగా, ఐ శ్రీనివాసరావు కెమెరా స్విఛాన్‌ చేశారు. ఆదివారం విడుదలచేసిన ఫస్ట్‌లుక్‌లో రవితేజ హుషారుగా కనిపిస్తుండగా, అతడిపై కరెన్సీ నోట్ల వర్షం కురుస్తుండటం ఆసక్తిని పంచుతోంది.  నిర్మాత మాట్లాడుతూ ‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. భిన్న పార్శాలతో ఈ పాత్రలు సాగుతాయి. వినూత్న కథాంశానికి అత్యున్నత సాంకేతిక ప్రమాణాలను జోడిస్తూ రమేష్‌వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నవంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం:సుజీత్‌ వాసుదేవ్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, సంభాషణలు: శ్రీకాంత్‌ విస్సా, సాగర్‌. ప్రొడక్షన్‌: హవీష్‌ ప్రొడక్షన్‌.logo