ఈ ఏడాది క్రాక్ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రవితేజ ప్రస్తుతం మాంచి జోరు మీదున్నాడు. తాజగా ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ఖిలాడి” చేస్తున్నాడు. రవితేజ కెరీర్లోనే భారీ యాక్షన్ అంశాలతో కూడుకున్న చిత్రంగా ఖిలాడి రూపొందుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం కొన్ని నెలల క్రితం ఖిలాడి చిత్ర బృందం ఇటలీ వెళ్లిన విషయం తెలిసిందే.
ఇటలీలో ఓ సాలిడ్ యాక్షన్ సీన్ సహా పలు ఆసక్తికర సన్నివేశాల కోసం మేకర్స్ వెళ్లి షూట్ ని నిర్వహించారు. రవితేజపై షూటింగ్ చేసిన బైక్ సీక్వెన్స్‌కి సంబంధించిన క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో రవితేజ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తుండగా డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.