ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 09, 2020 , 01:16:05

నిజాయితీ పోలీస్‌గా రవితేజ

నిజాయితీ  పోలీస్‌గా రవితేజ

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్రాక్‌'. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. ఠాగూర్‌ మధు నిర్మాత. శృతిహాసన్‌ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ బుధవారం హైదరాబాద్‌లో పునఃప్రారంభమైంది. నిర్మాత మాట్లాడుతూ ‘చివరి షెడ్యూల్‌ను ప్రారంభించాం. దీంతో షూటింగ్‌ పార్ట్‌ మొత్తం పూర్తవుతుంది. త్వరలో ట్రైలర్‌, పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌పోస్టర్‌, టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది’ అని తెలిపారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఓ నిజాయితీపరుడైన పోలీస్‌ ఆఫీసర్‌ కథ ఇది. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. రవితేజ పాత్ర చిత్రణ నవ్యపంథాలో ఉంటుంది. భావోద్వేగభరితంగా ఉంటూ ఆకట్టుకుంటుంది’ అన్నారు. సముద్రఖని, వరలక్ష్మీశరత్‌కుమార్‌, దేవిప్రసాద్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జి.కె.విష్ణు, సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా, నిర్మాత: బి. మధు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని.


logo