సండే ఎపిసోడ్ ఆట పాటలతో సందడి చేయించిన నాగ్ ఆ తర్వాత కళ్లకు గంతలు కట్టించి తాను ఇచ్చిన ఐటెంని గెస్ చేయాలి అన్నాడు. టీమ్ ఏ నుంచి సిరి, షన్ను వచ్చారు. అయితే సిరికి ఆవాలు వచ్చాయి. కానీ వాటిని షన్ను గెస్ చేయలేకపోయాడు. రేషన్ మేనేజర్‌కి ఆవాలు కూడా తెలియదా అంటూ రవి కౌంటర్స్ వేశాడు. ఇక ప్రియ,లహరి జంటగా రాగా.. లహరి పల్లీలను గెస్ చేసింది.
ప్రియాంక, శ్వేతా వర్మ జంటగా ఆగా, ప్రియాంక సగ్గుబియ్యం గురించి హిట్ ఇవ్వడంతో శ్వేతా చివరకు గెస్ చేసింది. యానీ మాస్టర్, విశ్వ రాగా.. అక్కడున్న ఇంకును యానీ మాస్టరే గుర్తుకుపట్టలేకపోవడంతో విశ్వ ఏమీ గెస్ చేయలేకపోయాడు. గోరుచిక్కుడు కాయ గురించి నటరాజ్ మాస్టర్ క్లూ ఇచ్చినా మానస్ కనిపెట్టలేకపోయాడు. సీతాఫలం గురించి సన్నీ ఎన్ని హింట్లు ఇచ్చినా హమీదా గుర్తు పట్టలేకపోయింది.
శ్రీరామచంద్ర టూత్‌పేస్ట్‌ను కనిపెట్టలేకపోయాడు. దాల్చిన చెక్క గురించి కాజల్ టచ్ చేసి క్లూ ఇవ్వడంతో రవి ఇట్టే కనిపెట్టాడు. ఎట్టకేలకు టచ్ చేయ్.. గెస్ చేయ్ ఆట పూర్తి కాగా, టీం బీ గెలిచిందని నాగ్ ప్రకటించాడు.దీంతో ఆ టీమ్ సభ్యులు జోష్‌లో ఉన్నారు.