కెమెరాల మధ్య ఉన్నామని మరచి కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తూ నవ్వుల పాలవుతున్నారు. రీసెంట్గా యాంకర్ రవి తాను తల్లి మీద ప్రామిస్ చేసి అబద్ధం ఆడాడు.ఈ విషయంలో రవి నవ్వుల పాలు కావలసి వచ్చింది. ఇండస్ట్రీలో మంచి యాంకర్‌గా పేరు తెచ్చుకున్న రవి ఆ ఒక్క ఘటనతో అభాసుపాలయ్యాడు.
నామినేషన్ చేసే సమయంలో ముందుగా మాట్లాడిన రవి.. అందరి ముందుకు రావాలంటేనే సిగ్గుగా ఉందని తలదించుకున్నాడు. చేతులు జోడించి మరీ క్షమాపణ చెప్పాడు రవి. శనివారం నా జీవితంలోనే వరస్ట్ రోజు. నేను ముగ్గురికి.. ప్రియ, లహరి, అమ్మకు సారీ చెప్తున్నాను. ప్రియకు చెప్పిన మాటను చెప్పలేదంటూ అమ్మ మీద ఒట్టేశాను అని బాధతో పశ్చాత్తాపపడ్డాడు.
నేను ప్రియతో చెప్పిన మాటని ఆవిడతోనే చెప్పలేదని చెప్పి మా అమ్మపై ఒట్టు పెట్టాను. అంతకంటే దారుణం మరోటి ఉండదు. ఇలా ఒక మగాడు మాట్లాడకూడదు.. నేను మాట్లాడాను.. అందుకే సిన్సియర్‌గా క్షమాపణ చెప్తున్నా. ఈరోజు లహరి ఇక్కడ లేదు.. తను ఇక్కడ ఉండి ఉంటే మాట్లాడేవాడిని. అమ్మ మీద ఒట్టేసి అంత పెద్ద మాట అన్నా.. సారీ అమ్మా.. సారీ అక్కా..’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం తనని కొట్టిందని కాజల్‌ను, గుంట నక్క అన్నాడని నటరాజ్ మాస్టర్ని నామినేట్ చేశాడు రవి.