సోమవారం 25 మే 2020
Cinema - Apr 01, 2020 , 13:07:35

తండ్రికి సాయం.. వంశ వృత్తిని మ‌రువ‌ని కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్

తండ్రికి సాయం.. వంశ వృత్తిని మ‌రువ‌ని కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్

క‌రోనా మహమ్మారి  చిన్నా పెద్ద.. బీద ధనిక అనే తేడా లేకుండా అందరిపై కూడా ప్రభావం చూపుతుంది. స్వీయ నియంత్ర‌ణ‌నే దీనికి స‌రైన ప‌రిష్కారం అని ప్ర‌తి ఒక్క‌రు చెబుతుండ‌డంతో ప్ర‌జ‌లందరు ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. అయితే ఎప్పుడు ప‌నుల‌తో బిజీగా ఉండే సెల‌బ్రిటీల‌కి ఇంత ఖాళీ స‌మ‌యం దొర‌క‌డంతో ఎవ‌రి స్టైల్‌లో వారు ఈ విలువైన‌ స‌మ‌యాన్ని చాలా చ‌క్క‌గా వినియోగించుకుంటున్నారు.

కేజీఎఫ్ చిత్రానికి సంగీతం అందించిన క‌న్న‌డ మ్యూజిక్ డైరెక్ట‌ర్  రవి బస్రూర్.. లాక్ డౌన్ స‌మ‌యంలో తన వంశ వృత్తిని చేస్తున్నాడు. ర‌వి స్వ‌స్థ‌లం ఉడిప్పి జిల్లా కుండపుర కాగా, అక్క‌డికి  వెళ్లిన రవి తన తండ్రి చేస్తున్న నగల తయారిలో భాగస్వామి అవుతున్నాడు.  ఒక్క వెండి ఆభరణం చేసినందుకు గాను 35 రూపాయలు వస్తాయని , ఈ పని చేస్తున్నందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నా తండ్రికి ఆసరాగా ఉండటంతో పాటు నా వృత్తిని మళ్లీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంగీత దర్శకుడు రవి అన్నారు.  


logo