ఇండియన్ సినిమాలకి సంబంధించి కొన్ని క్లాసిక్స్ ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి క్లాసిక్స్లలో బాలీవుడ్ పాటలు ఎన్నో ఉన్నాయి.ఆ పాటలలో కొన్ని పాటలకి మాధురీ దీక్షిత్ అదిరిపోయే డ్యాన్స్ వేసి ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. ఐటెమ్ నెంబర్స్‌లో దేశాన్ని ఊపేసిన పాటలెన్నో ఉన్నాయి. వాటన్నంటిలో నెంబర్ వన్‌గా నిలిచేది మాధురి దీక్షిత్ ఏక్ దో తీన్ మాత్రమే. ఈ పాటలోని రిథమ్, సాంగ్, మాధురి లుక్స్, స్టెప్ప్ ఇవన్నీ ఎప్పటికీ ఎవర్ గ్రీనే.
ఈ పాటలోని హుక్ స్టేప్ బాగా పాపులర్ అయ్యింది. అలానే దిల్ తో పాగల్ హై సినిమాలోని ఫేమస్ సాంగ్ ‘కోయి లడ్కి హై’కు మాధురీ దీక్షిత్ అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇప్పుడు ఇదే స్టైల్లో 62 ఏళ్ల రవి బాల శర్మరెండు పిలకలు వేసుకొని డ్యాన్స్ చేసింది. గులాబీ రంగు కుర్తా, తెలుపు పలాజో ధరించి అదిరిపోయే స్టెప్పులతో అచ్చం మాధురి దీక్షిత్‌ను దించేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. పాత వీడియోనే అయినప్పటికీ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.మిలియన్ వ్యాస్ రాబట్టిన ఈ వీడియోపై మీరు ఓ లుక్ వేయండి.